హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బియ్యపుతిప్ప సర్పంచ్‌గా రాజ్యలక్ష్మి గెలుపు..!

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం బియ్యపుతిప్ప సర్పంచ్‌ ఎన్నిక ఉత్కంఠ రేపింది. తొలుత 5 ఓట్లతో ముందున్న జనసేన బలపర్చిన మల్లాడి వెంకట రాజ్యలక్ష్మి, రీకౌంటింగ్‌లో 4 ఓట్లు తగ్గినా టీడీపీ అభ్యర్థి మల్లాడి జ్యోతిపై ఒక్క ఓటుతో గెలిచారు. రిటర్నింగ్ అధికారి ఆమె విజయాన్ని ఖరారు చేశారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.