హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ర్యాలీలో జనసేన ఇంఛార్జ్‌కి స్థానికుల నిరసన

కోనసీమ: ర్యాలి గ్రామంలో ఎన్డీఏ కూటమి సర్పంచ్ అభ్యర్థి ప్రచారానికి వచ్చిన జనసేన పార్టీ ఇంఛార్జ్‌ బండారు శ్రీనివాస్‌కు స్థానికుల నుంచి గురువారం నిరసన ఎదురైంది. ఇటీవల ఎంపీటీసీ ఎన్నికల సమయంలో వైస్ ఎంపీపీ పదవి ఇస్తామని హామీ ఇచ్చి, చివరకు మరొకరికి కట్టబెట్టారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో ఖర్చు చేయించి, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూ బండారును నిలదీశారు.