హైదరాబాద్: 28°C
వార్తలు

దారుణం.. భర్తను హత్య చేసిన భార్య

TG: నిజామాబాద్ జిల్లా నందిపేటలో దారుణం జరిగింది. భర్త గంగాధర్ (46)ను భార్య సుమలత హత్య చేసింది. కొంతకాలంగా గంగాధర్‌ మద్యానికి బానిస కావడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. తరచూ మద్యం మత్తులో భార్యను కొట్టేవాడు. చివరకు భర్త వేధింపులు తాళలేక భార్య అతని మెడకు ఉరేసి హత్య చేసింది. అనంతరం ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్నున్నట్లు ఎస్సై తెలిపారు.