హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ

JGL: రాయికల్ మండలంలోని 32 గ్రామాల్లో ఉపాధి హామీ పనులపై 16వ విడత సామాజిక తనిఖీని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రఘువరన్ ప్రారంభించారు. 537 పనులకు సంబంధించి రూ.5.89 కోట్ల వ్యయాన్ని తనిఖీ చేశారు. రికార్డులు, సంతకాలు, చెల్లింపు ఉత్తర్వుల్లో లోపాలపై అధికారుల మందలింపులు, నిబంధనల మేరకు రికార్డుల నిర్వహణ సూచనలు చేశారు.