హైదరాబాద్: 28°C
తెలంగాణ

విషాదం..కరెంట్ షాక్‌‌కు గురై రైతు మృతి

ఆదిలాబాద్: నేరడిగొండ మండలం పీచర గ్రామానికి చెందిన బైరి నర్సయ్య విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్ఐ ఇమ్రాన్ తెలిపారు. గురువారం వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై నర్సయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని SI పేర్కొన్నారు.