హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మౌలిక సదుపాయాలు కల్పన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం'

VZM: గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గురువారం దత్తిరాజేరు మండలంలోని దత్తి షికారుగంజి, పాచలవలస, టీ.బూర్జివలస,విజయరామపురం గ్రామాల్లో సర్పంచి అభ్యర్దికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.