భారత్- చైనా సరిహద్దులో పరిస్థితి సాధారణంగా, స్థిరంగా ఉందని చైనా సైన్యం వెల్లడించింది. ఇరు దేశాలు దౌత్య, సైనిక మార్గాల ద్వారా నిరంతర సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిపింది. సరిహద్దుల్లో ప్రశాంతతను కాపాడేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. అయితే అరుణాచల్‌ప్రదేశ్‌ను భారత్‌లో భాగంగా గుర్తించబోమని మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు.
వార్తలు
సరిహద్దులో పరిస్థితి స్థిరంగా ఉంది: చైనా


