హైదరాబాద్: 28°C
వ్యాపారం

2027 చివరికి 29,000కు నిఫ్టీ: జేపీ మోర్గాన్

భారత స్టాక్ మార్కెట్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ సానుకూల అంచనాలు వెల్లడించింది. 2027 చివరి నాటికి నిఫ్టీ-50 సూచీ 29,000 పాయింట్లకు చేరవచ్చని పేర్కొంది. అనుకూల పరిస్థితుల్లో 31,000కు పెరిగే అవకాశం ఉందని, ప్రతికూల పరిస్థితుల్లో 22,000కు పడిపోవచ్చని తెలిపింది. భారత కంపెనీల ఆదాయాలు, లాభాలు మెరుగుపడటం మార్కెట్ వృద్ధికి దోహదం చేస్తాయని అంచనా వేసింది.