AP: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 3 చోట్ల ఇవాళ రీపోలింగ్ జరగనుంది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మం. వెల్లటూరు, గరికిపాడుల్లో.. సత్యసాయి జిల్లా కనగానిపల్లి మం. నర్సంపల్లిలో రీ పోలింగుకు SEC ఆదేశించింది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రీపోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అది పూర్తవగానే ఉపసర్పంచ్ ఎన్నిక జరగనుంది.
వార్తలు
పంచాయతీ పోరు.. నేడు 3 చోట్ల రీపోలింగ్


