హైదరాబాద్: 28°C
వార్తలు

పంట బీమా.. రైతులకు కీలక సూచన

AP: రబీ 2026-27 పంట బీమా కోసం వరి, మామిడి పంటలకు డిసెంబర్ 31లోగా వివరాలు నమోదు చేసుకోవాలని రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఇతర నోటిఫైడ్ పంటలకు డిసెంబర్ 15లోగా నమోదు చేసుకోవాలని కోరారు. పంటల బీమా సందేహాల నివృత్తికి కిసాన్ కాల్ సెంటర్ 1800-180-1551 లేదా హెల్ప్‌లైన్ 155251ను సంప్రదించవచ్చని చెప్పారు. పంట బీమా విషయంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు.