హైదరాబాద్: 28°C
వార్తలు

హింసకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవు: DGP

AP: స్థానిక సంస్ధల ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని DGP హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి పల్నాడు, సత్యసాయి, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 44 ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. వీటికి సంబంధించి కేసులు నమోదు చేశామన్నారు. నిందితులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.