హైదరాబాద్: 28°C
వార్తలు

AEOలకు జాబ్‌చార్ట్‌ విడుదల చేసిన ప్రభుత్వం

AP: గ్రేడ్‌ 1,2 వ్యవసాయ విస్తరణ అధికారుల(AEO)కు ప్రభుత్వం జాబ్‌ చార్ట్‌ విడుదల చేసింది. వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలు, డేటా నిర్వహణ, నేల సంరక్షణ, ఉత్పాదకాల నిర్వహణ, రైతుల నైపుణ్య సామర్థ్యం పెంపు, విపత్తు నిర్వహణ వంటి విధులతో జాబ్‌చార్ట్‌ రూపొందించింది. ఉన్నతాధికారుల సూచనలను పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.