హైదరాబాద్: 28°C
క్రీడలు

లారా రికార్డుపై వైభవ్‌ గురి.. పీటర్సన్‌ జోస్యం!

యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదిన భారత 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు. మరో ఐదేళ్లలో వైభవ్ టెస్టు క్రికెట్‌లో 500 పరుగుల ఇన్నింగ్స్ ఆడతాడని పీటర్సన్ జోస్యం చెప్పాడు. వైభవ్ ఆటతీరు చూస్తుంటే బ్రియాన్ లారా (400*) అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డుకు ముప్పు తప్పదని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.