హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాక్సింగ్ క్రీడల్లో ఆశాకిరణాలు

AKP: నర్సీపట్నంలో బాక్సింగ్ క్రీడకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. పదేళ్ల క్రితం శాప్ ఆధ్వర్యంలో ప్రారంభమైన శిక్షణతో ఎంతోమంది క్రీడాకారులు రాణించారు. ఇప్పటివరకు ముగ్గురు అంతర్జాతీయ స్థాయిలో, 14 మంది జాతీయ స్థాయిలో, వంద మందికి పైగా రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించారు. వీరిలో సుమారు 30 మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం విశేషం.