హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

2612 ఓట్లతో గెలిచిన జనసేన మద్దతుదారుడు

అనకాపల్లి మండలం కొత్తూరు మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా జనసేన బలపరిచిన అభ్యర్థి మేడిశెట్టి సత్తిబాబు ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై 2,612 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. తనకు భారీ మెజారిటీ అందించిన ప్రజలకు సత్తిబాబు కృతజ్ఞతలు తెలిపారు.