అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట మండలంలోని ఏకైక మేజర్ పంచాయతీ వడ్డాదిలో వైసీపీ మద్దతుదారు దాడి గోవిందరావు సర్పంచ్‌గా విజయం సాధించారు. కూటమి అభ్యర్థి దొండా నరేశ్‌పై 1,083 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అన్ని రౌండ్లలోనూ ఆధిక్యం కొనసాగించారు. 14 వార్డుల్లో వైసీపీ, కూటమి మద్దతుదారులు చెరో 7 వార్డులు గెలుచుకున్నారు. క్రాస్ ఓటింగ్ ప్రభావం ఫలితాల్లో కనిపించింది.
ఆంధ్రప్రదేశ్
1,083 ఓట్ల మెజారిటీ YCP మద్దతుదారు గెలుపు


