హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ స్థలాలను పరిశీలించిన జేసీ

అన్నమయ్య: జిల్లాలో విద్యుత్ సరఫరా మెరుగుదలకు ప్రతిపాదించిన 33/11 KV సబ్ స్టేషన్ల స్థలాలను జేసీ శివ నారాయణ శర్మ పరిశీలించారు. రాయచోటి మండలం రాయచోటి గ్రామం, కురబలకోట మండలం ముదివీడు గ్రామంలో ప్రతిపాదిత స్థలాలను RDO, తహసీల్దార్లతో కలిసి చూశారు. స్థల అనుకూలత, భూమి విస్తీర్ణం, మౌలిక సదుపాయాలపై ఆరా తీసి తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.