హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొల్లపల్లి వైసీపీ సర్పంచ్ మద్దతురాలు సావిత్రమ్మ విజయం

ATP: రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలం లోని గొల్లపల్లి గ్రామంలో వైసీపీ పార్టీ బలపరిచిన సావిత్రమ్మ సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించింది. దీంతో వైసీపీ సర్పంచ్ ఖాతా తెరవడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేపట్టారు. తనపై నమ్మకం ఉంచి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానంది.