హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే

బాపట్ల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పరిశీలించారు. పట్టణంలోని బేతనీ కాలనీ 35వ వార్డులో ఉన్న పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన, అక్కడ ఓటింగ్ జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.