BPT: బాపట్ల 20వ వార్డు ఆంజనేయ అగ్రహారం మున్సిపల్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద కొందరు యువకులు హంగామా సృష్టించారు. వెంటనే స్పందించిన బాపట్ల ఎస్పీ ఆఫీస్ వీఆర్ సీఐ మర్రి శివ కుమార్ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు వార్డులో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత


