హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్ల గడియారం స్తంభం వద్ద రోడ్డు ప్రమాదం

BPT: బాపట్ల పట్టణంలోని గడియారం స్తంభం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అటుగా వెళ్తున్న ఓ అశోక్ లేలాండ్ వాహనం అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.