CTR: కుప్పం మండలం వసనాడు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి సుబ్బలక్ష్మమ్మ విజయకేతనం ఎగురవేశారు. తన ప్రత్యర్థిపై 477 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఆమెకు అభినందనలు తెలిపి సంబరాలు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
వసనాడులో టీడీపీ అభ్యర్థి ఘన విజయం


