PPM: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్వతీపురం కోర్టు ప్రాంగణంలో గురువారం అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. మాధురి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంతో పాటు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అందించే మహత్తర పత్రం అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కోర్టులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


