హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

505.6 లీటర్ల మద్యం స్వాధీనం

AKP: నక్కపల్లి మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన పుదుచ్చేరి మద్యంపై పాయకరావుపేట ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో 295 విస్కీ నిప్ బాటిళ్లు, 905 బీర్ టిన్లు కలిపి 505.6 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్ట్ చేశారు. ఒక స్మార్ట్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇన్‌స్పెక్టర్ జి.శ్రీనివాసరావు, ఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు.