హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టి.సాకిబండలో స్వతంత్ర అభ్యర్థి విజయం

కర్నూలు జిల్లా హాలహర్వి మండలం టి.సాకిబండ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పద్మ ఘన విజయం సాధించారు. మొత్తం 254 ఓట్ల ఆధిక్యంతో ప్రత్యర్థులపై గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించడంతో ఆమె మద్దతుదారులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో సంబరాలు నిర్వహించారు.