హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో 85 శాతం గ్రీనరీ: CBN

TPT: తక్కువ వర్షపాతం నమోదైనా తిరుమలలో 85 శాతం పచ్చదనం ఉందని, దేశంలో మరెక్కడా ఇలాంటి పరిస్థితి లేదని సీఎం చంద్రబాబు అన్నారు. గోరక్షణ, వేద పరిరక్షణకు తిరుమల నుంచే శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. టీటీడీ ద్వారా 22 వేల మందికి విద్య అందిస్తున్నట్లు తెలిపారు. హంద్రీనీవా నీటిని కళ్యాణి డ్యాంకు, సోమశిల నీటిని బాలాజీ రిజర్వాయర్‌కు తరలిస్తామని వెల్లడించారు.