హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాట్రాయపాడు పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత

నెల్లూరు జిల్లా దగదర్తి మండలం కాట్రాయపాడు పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి, ఇరువర్గాలు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘర్షణకు దిగిన వారిని చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసు బందోబస్తు పెంచారు.