హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

 దొంగ ఓట్ల కలకలం.. వెల్లటూరులో ఉద్రిక్తత

పల్నాడు జిల్లా పొల్లాపల్లి(M) వెల్లటూరు గ్రామంలో దొంగ ఓట్ల వ్యవహారం కలకలం రేపింది. టీడీపీ కార్యకర్త దొంగ ఓట్లు వేసేందుకు వెళ్లినట్లు ఆరోపిస్తూ గ్రామస్తులు అతడిని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎన్నికల వేళ ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.