హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీలోని నందగిరిపేట, చింతాడతో పాటు పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని, మొబైల్ పోలీసు బృందాలతో నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు.