హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజ్యాంగ స్ఫూర్తిని భావితరాలకు అందించాలి-డిఆర్ఓ

విశాఖపట్నం: రాజ్యాంగ ఆశయాలు, స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీఆర్వో ఎస్.డి. అనిత అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో పీఠికను చదివి ప్రతిజ్ఞ చేయించారు. అంబేద్కర్‌కు నివాళులర్పించారు. హక్కులతో పాటు విధులను గుర్తించి రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.