హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారు ఢీకొని మహిళ మృతి

NTR: పెనుగంచిప్రోలు డౌన్ సెంటర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తుమ్మల నాగమణి అనే మహిళ మృతి చెందగా, గారే భాగ్యమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఆసుపత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు.