NLR: వింజమూరులో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రాల్లోకి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ వెళ్లడంపై వైసీపీ ఉదయగిరి ఇన్‌ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను కూడా లోపలికి వెళ్తానని పట్టుబట్టగా పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులతో కొంతసేపు వాగ్వాదం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలీసులతో రాజగోపాల్ రెడ్డి వాగ్వాదం


