హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఒక్క నిమిషం ఆలస్యం.. ఓటరుకు నిరాశ..!

KDP: పోరుమామిళ్ల మేజర్ పంచాయతీలో పోలింగ్ సమయం ముగియడంతో పోలీసులు గేట్లు మూసివేశారు. ఈ క్రమంలో రెండో వార్డుకు చెందిన ఓటరు ఒక్క నిమిషం ఆలస్యంగా చేరుకోవడంతో పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో ఓటు హక్కు వినియోగించుకోలేక వెనుదిరిగారు. కేవలం ఒక్క నిమిషం ఆలస్యంతో ఓటు కోల్పోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.