హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాంతిపురంలో 83.11 శాతం పోలింగ్

CTR: శాంతిపురం మండలంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 83.11 శాతం పోలింగ్ నమోదైంది. 23 గ్రామ పంచాయతీల పరిధిలోని 196 కేంద్రాల్లో మొత్తం 48,350 మంది ఓటర్లకు గాను 40,186 మంది ఓటు వేశారు. వీరిలో 20,207 మంది పురుషులు, 19,979 మంది మహిళలు ఉన్నారు. కొనేరుకుప్పంలో అత్యధికంగా 91.98 శాతం, కర్లగట్టలో అత్యల్పంగా 74.98 శాతం పోలింగ్ నమోదైంది.