W.G: భీమవరం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గురువారం స్థానిక ఏఆర్కేఆర్ (ARKR) హైస్కూల్లోని 4వ వార్డు పోలింగ్ బూత్‌లో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రెండో విడత మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల సంపూర్ణ మద్దతుతో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి


