హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికుల మధ్య గలాటా

VZM: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికుల మధ్య గలాటా కారణంగా ఎస్‌.కోట వెళ్లే బస్సు సుమారు గంటపాటు నిలిచిపోయింది. బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో బస్సు రాగానే దిగాల్సిన ప్రయాణికులను పట్టించుకోకుండా ఎక్కేందుకు మహిళలు పోటీపడ్డారు. దీంతో వాగ్వాదం, గందరగోళం నెలకొంది. మరో బస్సు రావడంతో పరిస్థితి సద్దుమణిగి, నిలిచిపోయిన బస్సు బయలుదేరింది.