హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాళ్లపూడి మండలంలో 81.75 శాతం పోలింగ్

E.G: తాళ్లపూడి మండలంలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన పోలింగ్లో 81.75 శాతం ఓటింగ్ నమోదైంది. మండలంలోని 11 గ్రామ పంచాయతీల పరిధిలో 134 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొత్తం 41,882 మంది ఓటర్లకు గాను 34,237 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 16,909 మంది పురుషులు, 17,327 మంది మహిళలు ఉన్నారు.