హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల పర్యవేక్షణ

PPM: జిల్లాలో జరుగుతున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సరళిని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్. ప్రభాకర రెడ్డి వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వివిధ పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించి సమీక్షించారు.