హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెండింగ్ పనులు వేగవంతం చేయాలి'

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో పెండింగ్‌లో ఉన్న 301 అభివృద్ధి పనులను డిసెంబర్ 3 నుంచి వేగవంతం చేయాలని చైర్‌పర్సన్ చింతకాయల పద్మావతి అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో రూ.186 కోట్ల తాగునీటి పథకానికి సంబంధించి 164 కిలోమీటర్ల పైప్‌లైన్‌కు గాను 80 కిలోమీటర్ల పనులే పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.