హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే ఉద్యోగుల ఆందోళన హెచ్చరిక

VSP: పాత పింఛన్ విధానం పునరుద్ధరణ, 8వ వేతన సంఘం సిఫార్సుల అమలు, ఖాళీల భర్తీ తదితర డిమాండ్లను పరిష్కరించకపోతే దేశవ్యాప్త ఆందోళన చేపడతామని NFIR ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య హెచ్చరించారు. బుధవారం విశాఖలోని సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త రైల్వే జోన్ ఏర్పాటులో ఉద్యోగుల సీనియారిటీ, బదిలీ హక్కులకు భంగం కలగకుండా చూడాలని కోరారు.