హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు సాయంత్రం లోగా దరఖాస్తు చేసుకోవాలి'

AKP: ఎన్నికల విధుల్లో ఇతర మండలాలకు వెళ్లే అధికారులు, సిబ్బంది ఈనెల 27వ తేదీ సాయంత్రంలోగా పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని కోటవురట్ల రిటర్నింగ్ అధికారి చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. పోస్టల్ బ్యాలెట్ కోసం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఓటు వేసే అవకాశం కల్పించామన్నారు.