హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ వేళ ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కారుపై దాడి!

NDL: అహోబిలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కారుకు చెందిన అద్దాలు పగిలిపోయాయి.