హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంగులపాలెం బూత్ వద్ద ఉద్రిక్తత

PLD: బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం పంచాయతీ గంగులపాలెం బూత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సుమారు 8 కార్లలో బయటి రౌడీలను తీసుకొచ్చి, కర్రలతో హల్‌చల్ చేస్తూ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ పోలింగ్‌కు ఆటంకం కలిగిస్తున్నారని చెబుతున్నారు. పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.