NDL: రుద్రవరం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 6,896 ఓట్లకు గాను 5,183 ఓట్లు నమోదై 75.16 శాతం పోలింగ్ జరిగింది. ఇందులో 2,543 మంది పురుషులు, 2,640 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు ఉత్సాహంగా తరలిరావడంతో పోలింగ్ శాతం గణనీయంగా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
రుద్రవరంలో 75.16 శాతం పోలింగ్ నమోదు


