కోనసీమ: రాజోలు మండలం శివకోడులో గురువారం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మరో పది నిమిషాల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఓ నవ వధువు, పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంది. వివాహ వేడుక కంటే ముందు ప్రజాస్వామ్య బాధ్యతకు ప్రాధాన్యం ఇచ్చిన ఆమె ఆలోచనను అక్కడున్న వారంతా ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్
పెళ్లి పీటలెక్కే ముందు ఓటేసిన నవ వధువు


