ASR: పాడేరు మండలం లగిసిపల్లి వద్ద హైవే నిర్మాణం పేరుతో జరుగుతున్న రిగ్ బ్లాస్టింగ్ను వెంటనే నిలిపివేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు సాగిన ధర్మాన పడాల్ డిమాండ్ చేశారు. గురువారం నేతలు వీ. దాస్, కార్తీక్, భానుతో కలిసి బ్లాస్టింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. కేవలం 200 మీటర్ల దూరంలో నివాస గృహాలు ఉండటంతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'రిగ్ బ్లాస్టింగ్ను వెంటనే నిలిపివేయాలి'


