TPT: తిరుమల చరిత్రలో శ్రీవారికి సమర్పించిన అతిపెద్ద కానుక ఇదేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వర్ధమాన జైన్ 121 కిలోల బంగారంతో స్వామివారికి ఆభరణాలు, పద్మావతమ్మకు స్వర్ణ వస్త్రం తయారు చేయించారని తెలిపారు. ఇందులో 106 కిలోలతో శ్రీవారికి ఆభరణాలు, 15 కిలోలతో అమ్మవారికి వస్త్రం రూపొందించారన్నారు. 238 క్యారెట్ల వజ్రాలు, రత్నాలతో కూడిన ఈ కానుక విలువ రూ.206 కోట్లని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమల చరిత్రలో అతిపెద్ద కానుక: సీఎం


