హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టరేట్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

ATP: అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, డీఆర్ఓ ఏ. మలోల తదితరులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను పఠించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.