హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హక్కులతో పాటు అవగాహన అవసరం: కలెక్టర్

అన్నమయ్య: రాయచోటి ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు ప్రాథమిక బాధ్యతలను కూడా గుర్తించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాయచోటి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.