TPT: శ్రీకాళహస్తిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. మొత్తం 44 వార్డులకు సంబంధించి 88 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు 16,426 మంది పురుషులు, 18,888 మంది మహిళలు కలిపి మొత్తం 35,314 మంది ఓటు వేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు, పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తిలో ప్రశాంతంగా పోలింగ్


